Header Banner

ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం! వైసీపీలో మొదలైన టెన్షన్ - రాజ్ కసిరెడ్డి కోసం సిట్ వేట ముమ్మరం!

  Mon Apr 14, 2025 22:14        Politics

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి కోసం ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గాలింపును తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సిట్ అధికారులు హైదరాబాద్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా కసిరెడ్డికి సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ప్రదేశాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు. మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా రాజ్ కసిరెడ్డి పాత్ర కీలకమని సిట్ అధికారులు ముందునుంచీ భావిస్తున్నారు. ఈ కేసు విచారణకు హాజరు కావాలంటూ గతంలోనే ఆయనకు నోటీసులు జారీ చేసినప్పటికీ, కసిరెడ్డి స్పందించలేదని, విచారణకు గైర్హాజరై తప్పించుకు తిరుగుతున్నారని సిట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కుంభకోణం వెనుక ఉన్న మరింత మంది కీలక వ్యక్తుల వివరాలు రాబట్టాలంటే కసిరెడ్డి విచారణ అత్యంత ముఖ్యమని దర్యాప్తు అధికారులు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.

 

ఇది కూడా చదవండి: చంద్రబాబు సూచనలతో రంగంలోకి మంత్రి.. రాజధాని నిర్మాణంలో 3 వేల మంది కార్మికులు, 500 మెషీన్లు!

 

హైదరాబాద్‌లో మొత్తం 10 ప్రత్యేక సిట్ బృందాలు ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. రాజ్ కసిరెడ్డి నివాసం, కార్యాలయంతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లలో కూడా అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడుతున్నారు. ఒకటి రెండు రోజుల పాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాజ్ కసిరెడ్డి లభ్యమైతే ఈ కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించవచ్చని, మరిన్ని వివరాలు బయటకు వస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. కసిరెడ్డి దొరికితే తక్షణమే అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. రాజ్ కసిరెడ్డి... ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు బంధువు అని తెలుస్తోంది. గత ప్రభుత్వ  హయాంలో ఐటీ సలహాదారుగా వ్యవహరించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. ఈ రూట్లో ఆరులైన్లుగా - భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలెర్ట్.. రాష్ట్రంలోని 98 మండలాల్లో నేడు వడగాల్పులు, వానలు - ఎక్కడెక్కడంటే?

 

సీఆర్‌డీఏ కీలక ప్రతిపాదన! వేల ఎకరాల భూమి సమీకరణ! అవి మళ్లీ ప్రారంభం!

 

వైసీపీకి మరో బిగ్ షాక్! కీలక నేత రాజీనామా! జనసేన పార్టీ లోకి చేరిక?

 

వైసీపీకి భారీ షాక్.. రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు.. జగన్ అక్రమాలన్నీ బయటకు తెస్తా..

 

వారందరికీ పండుగ లాంటి వార్త.. ఆ జిల్లా చుట్టూ పెరగనున్న భూముల ధరలు! ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

మాట నిలబెట్టుకుంటున్న లోకేష్.. సొంత నియోజకవర్గంలో మరో హామీకి శ్రీకారం!

 

మంత్రుల పేషీల్లో అవినీతి.. ఇంటెలిజెన్స్ నివేదికలో షాకింగ్ నిజాలు! సీఎం చంద్రబాబు హెచ్చరికలు జారీ!

 

ఛీ.. ఛీ.. ఏం చిల్లరగాళ్లురా మీరు.. లారీలు చోరీ చేసిన వైకాపా నాయకుడు!

 

NRI లకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు! పూర్తి వివరాలు అందరూ తప్పక తెలుసుకోవాల్సిందే! GO కూడా విడుదల!

 

మాజీ మంత్రిపై సోమిరెడ్డి సెటైర్.. ఒకవేళ జైలుకు వెళితే అక్కడ నీ ఫ్రెండ్ ఉంటాడు పలకరించు.!

 

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన UPI సేవలు.. ఇబ్బందుల్లో యూజర్లు! ఇది మూడోసారి..

 

రైతులకు శుభవార్త.. వారికి రూ.10 వేలు ప్రభుత్వం మంచి నిర్ణయం.! ఈ పరిహారం ద్వారా.. వారికి మాత్రమే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Jagan #YSRCP #Dastagiri #Pulivendula #Nomination